కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం...
- April 27, 2023
హైదరాబాద్: గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో హస్తం నేతలు దీక్షకు దిగారు. దేశమంతా బీజేపీ వ్యవహార శైలిని గమనిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ తన అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్న సమయంలో దేశంలోని ప్రజలు కంట తడిపెట్టారన్నారు. స్వాతంత్రం కోసం గాంధీ కుటుంబం తమ ఆస్తులను త్యాగం చేసిందని గుర్తుచేశారు. రాహుల్ గాంధీని బిజెపి అనేక విధాలుగా వేధిస్తోందని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దేశ్వర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రజలను కలుస్తుంటే బిజెపికి భయం పట్టుకుందన్నారు. పార్లమెంట్లో అధిక శాతం నేరచరిత్ర కలిగిన ఎంపీలే ఉన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మోదీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









