కువైట్ నుండి 11,000 మంది బహిష్కరణ

- April 29, 2023 , by Maagulf
కువైట్ నుండి 11,000 మంది బహిష్కరణ

కువైట్: ఈ ఏడాది మొదటి 4 నెలల్లో వివిధ దేశాలకు చెందిన 11,000 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులను కువైట్ బహిష్కరించింది. జనవరి 1 నుండి ఏప్రిల్ 28 వరకు దాదాపు 11 వేల మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు కొనసాగుతాయని,  అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఆశ్రయించే వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  తగిన చర్యలు తీసుకోవడానికి ఉల్లంఘనదారులను సమర్థ అధికారులకు రిఫర్ చేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com