సుడాన్ నుంచి 80 దేశాలకు చెందిన 2872 మంది తరలింపు:సౌదీ
- April 29, 2023
జెడ్డా: సుడాన్‌లోని సంఘర్షణ ప్రాంతాలలో చిక్కుకున్న వందలాది మందిని ప్రతిరోజూ సురక్షితంగా తరలించేలా సౌదీ అరేబియా తన వనరులన్నింటినీ ఉపయోగిస్తుంది. శుక్రవారం నాటికి సూడాన్ నుండి వివిధ దేశాలకు చెందిన మొత్తం 3 వేల మందివరకు సురక్షితంగా తరలించింది. సౌదీ వచ్చిన వారికి కావాల్సిన సౌకర్యాలు, సేవలను అందిస్తోంది. సౌదీ భద్రతా సిబ్బంది తమ దేశానికి వచ్చిన విదేశీయులను వారి భాషల్లో పలకరించి యోగక్షేమాలను తెలుసుకుంటుంది. రాయల్ సౌదీ నేవీ అధికారులు జెడ్డా ఇస్లామిక్ పోర్ట్‌కు చేరుకున్న పలువురు చైనీస్, ఇతర జాతీయులను చైనీస్, ఇంగ్లిష్ లో స్వాగతించారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన హజ్, ఉమ్రా యాత్రికులకు సేవ చేస్తున్నప్పుడు భద్రతా సిబ్బంది అనేక భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. తాజాగా 195 మంది నిర్వాసితులతో కూడిన కొత్త బ్యాచ్ శుక్రవారం జెడ్డాలో అడుగుపెట్టింది. తరలింపు ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుండి సూడాన్ నుండి తరలివచ్చిన వారి మొత్తం సంఖ్య 2991కి చేరుకుంది. వీరిలో 119 మంది సౌదీ పౌరులు ఉండగా.. 80 దేశాలకు చెందిన 2872 మంది ఇతరులు ఉన్నారు. ఏప్రిల్ 15న సుడాన్ లో అంతర్గత సంఘర్షణ ప్రారంభమైన వెంటనే సౌదీ అరేబియా రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలకు అనుగుణంగా తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







