ఇరాన్ నిర్బంధంలో 24 మంది భారతీయ సిబ్బంది..!
- April 29, 2023
గల్ఫ్: ఒమన్ తీరంలో ఇరాన్ స్వాధీనం చేసుకున్న యుఎస్-బౌండ్ ఆయిల్ ట్యాంకర్‌లో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిని విడుదల చేయడానికి కృషి చేస్తున్నామని నౌక ఆపరేటర్ శుక్రవారం వెల్లడించారు. మార్షల్ ఐలాండ్స్ ఫ్లాగ్ చేసిన అడ్వాంటేజ్ స్వీట్‌ను(నౌక) ఇరాన్ నావికాదళం "అంతర్జాతీయ వివాదం" కారణంగా గుర్తుతెలియని ఓడరేవుకు తీసుకువెళ్లినట్లు ఆపరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇరాన్ అధికారులు నిర్బంధించిన ఓడ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం లేదని, సంబంధిత అధికారులందరితో చర్చలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే, తన ఓడలో ఒకదానితో అడ్వాంటేజ్ స్వీట్ ఢీకొట్టిందని, ఈ ఘటనలో ఇద్దరు ఇరాన్ సిబ్బంది తప్పిపోయారని మరియు అనేకమంది గాయపడ్డారని ఇరాన్ ఆరోపిస్తుంది. మరోవైపు గల్ఫ్ జలాల్లో ఇరాన్ పెత్తనాన్ని అమెరికా ఆక్షేపించింది. స్వాధీనం చేసుకున్న నౌకను తక్షణమే విడుదల చేయాలని అమెరికా నావికాదళం డిమాండ్ చేసింది. ఓడ కువైట్ నుండి చమురును లోడ్ చేసుకొని వస్తుండగా ఈ ఘటన జరిగిందని అడ్వాంటేజ్ ట్యాంకర్స్ ప్రతినిధి తెలిపారు. ప్రపంచంలోని సముద్రపు చమురులో మూడింట ఒక వంతును మోసుకెళ్లే గల్ఫ్‌లోని సున్నితమైన జలాల్లో గురువారం నాటి నిర్బంధం ఘటన ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని స్తంభింపజేసిన బహుళజాతి ఒప్పందం నుండి అమెరికా వైదొలిగిన 2018 నుండి ఇటువంటి సంఘటనలు జరగడం పెరగడం గమనార్హం.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







