అప్పడు ‘లైగర్’.! ఇప్పుడు ‘ఏజెంట్’.!
- April 29, 2023
‘లైగర్’ సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు, ప్రమోషన్లలోనే కాదు, సినిమా కోసం కూడా ఆ కండలు పెంచేయడం, తెలంగాణా యాసలో డైలాగులు కాదు, కాదు, బూతులు వల్లెవేసేయడం.. గట్రా అప్పట్లో ఓ వర్గం ఆడియన్స్‌ని చాలా ఇబ్బందికి గురి చేశాయ్.
తీరీ చూస్తే సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ వర్గం ఆడియన్స్ తెగ పండగ చేసుకున్నారు. దెబ్బకి విజయ్ దేవరకొండ అడ్రస్ గల్లంతైపోయింది ‘లైగర్’తో. ‘లైగర్’ ముచ్చట అలా వుంచితే, తాజాగా ‘ఏజెంట్’ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది.
సినిమా కోసం అఖిల్ కూడా కష్టపడి ఊహించని మేకోవర్‌లోకి వెళ్లిపోయాడు. సినిమా అంత గొప్ప.. ఇంత గొప్ప.. అంటూ రిలీజ్‌కి ముందు ప్రమోషన్లలో డప్పు కొట్టేసుకున్నారు.
తీరా చూస్తూ డిజాస్టర్ టాక్ కట్టబెట్టేశారు రిలీజ్ తర్వాత ‘ఏజెంట్’కి. దాంతో, అఖిల్ అడ్రస్ కూడా గల్లంతైపోతుందా.? అనే అనుమానాలు వస్తున్నాయ్.
ఎందుకొచ్చిన తంటా ఇది అఖిల్‌కి.. చక్కగా లవర్ బోయ్ సినిమాలు చేసుకోవచ్చుగా.. మినిమమ్ బడ్జెట్లో. భారీ బడ్జెట్లు, లాంగ్ టైమింగ్లూ.. ఎందుకొచ్చిన ఓవరాక్షన్ ఇదంతా. స్టార్డమ్ సంగతి సరే సరి.. అసలు కనీసం మినిమమ్ హీరోగా అయినా కెరీర్ నిలబెట్టుకోలేకపోతున్నాడు అఖిల్.. అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ జరుగుతున్నాయ్.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







