BD100,000 విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
- April 30, 2023
బహ్రెయిన్: మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 27 - 40 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100,000 బహ్రెయిన్ దినార్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులందరూ ఆసియా జాతీయులేనని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ యాంటీ నార్కోటిక్స్ విభాగం తెలిపింది. బహ్రెయిన్‌లో పురుషులు చట్టవిరుద్ధమైన పదార్థాలను విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే విచారణ ప్రారంభించామని, అక్రమ పదార్థాలతో అనుమానితులను గుర్తించి, పట్టుకున్నామని యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు. ఇంకా, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉందని, ఎప్పుడైనా హాట్‌లైన్ (996) ద్వారా మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు లేదా సమాచారాన్ని నివేదించాలని పౌరులు, నివాసితులను కోరింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









