అబ్షెర్ ప్లాట్‌ఫారమ్ లో కొత్త సర్వీస్ ప్రారంభం
- May 02, 2023
జెడ్డా: అబ్షెర్ ప్లాట్‌ఫారమ్ (అబ్షెర్ అఫ్రాడ్) డెలివరీ రంగంలో పని చేయాలనుకునే సౌదీ పురుషులు, మహిళల వ్యక్తిగత.. వృత్తిపరమైన డేటాను పొందడానికి కంపెనీలను అనుమతించే 'కుఫు' పేరుతో కొత్త సేవను ప్రారంభించింది. డెలివరీ రంగంలో పని చేయాలనుకునే సౌదీ వ్యక్తుల అవసరమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఈ సేవ కంపెనీలు, సంస్థలను అనుమతిస్తుంది. సంబంధిత వ్యక్తి ఫోటో, వాహనం మోడల్, తయారీ సంవత్సరం, బీమా స్థితి, డ్రైవింగ్ లైసెన్స్, భద్రతా స్థితి, జాతీయత, జిల్లాతో జాతీయ చిరునామా, భౌగోళిక స్థానం (నగరం), వాహన లైసెన్స్ చెల్లుబాటు, పుట్టిన తేదీ, లింగం, ID నంబర్ తదితర వివరాలన్ని ఇందులో ఉంటాయి. మానవ వనరుల అభివృద్ధి నిధి (HADAF) మానవ వనరులు, సామాజిక అభివృద్ధి వ్యవస్థలో భాగంగా డెలివరీ రంగంలో కార్మికుల కోసం స్వీయ ఉపాధి మద్దతు కార్యక్రమాన్ని ఆమోదించింది. సౌదీ పురుషులు, మహిళలకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి.. కొన్ని ఆర్థిక కార్యకలాపాలలో వృత్తిపరమైన రంగాల్లో స్థానికీకరణను విస్తరించడం ఈ కొత్త సేవల లక్ష్యంగ ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆమోదించిన అప్లికేషన్లలో ఒకదాని ద్వారా ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!







