మహిళ గదిలోకి చొరబడి అత్యాచారయత్నం.. ఆసియా వ్యక్తికి జైలుశిక్ష
- May 02, 2023
దుబాయ్: మహిళ గదిలోకి చొరబడి అత్యాచారయత్న చేసిన ఘటనలో 34 ఏళ్ల ఆసియా వ్యక్తికి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం అతనిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. అప్పీల్ కోర్టు కూడా తీర్పును సమర్థించింది.పోలీసు రికార్డుల ప్రకారం, నిందితుడు తన గదిలోకి ప్రవేశించి తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని ఆసియా మహిళ ఫిర్యాదు చేసింది. తన పాదాలను ఎవరో తాకినట్లు తనకు అనిపించిందని, దీంతో అరుస్తూ తన రూమ్మేట్ని నిద్రలేపినట్లు ఆ మహిళ తెలిపింది. ఆమె రూమ్మేట్ అప్పుడు మహిళ మంచం పాదాల దగ్గర నిలబడి ఉన్న వ్యక్తిని చూసి షాక్ తిన్నట్లు.. నిందితుడు ఆమెను నిశ్శబ్దంగా ఉండమని, కేకలు వేయవద్దని బెదిరించడతో.. సెక్యూరిటీని పిలిచారు. అనంతరం ఎలివేటర్లకు వెళ్లే కారిడార్ గుండా నిందితుడు పారిపోయాడు. నిఘా కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. నిందితుడు ఆసియన్ వర్కర్ అని, అతను ఎదురుగా ఉన్న భవనంలో నివసిస్తున్నాడని గుర్తించారు. కాగా నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోలేదు. మద్యం మత్తులో ఉన్నందున జరిగిన చర్యలు గుర్తుకు లేవన్నారు.కోర్టు అతనిని దోషిగా నిర్ధారించి తన తీర్పును వెలువరించింది. అప్పీల్ కోర్టు ఈ శిక్షను సమర్థించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







