న్యూఢిల్లీలో సమావేశమైన భారత్-కువైట్ విదేశాంగ ప్రతినిధులు
- May 03, 2023
కువైట్: ఐదవ ఇండియా-కువైట్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు (FOC) మే 2వ తేదీన న్యూఢిల్లీలో జరిగాయి. భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (గల్ఫ్) శ్రీ విపుల్ నాయకత్వం వహించారు. కువైట్ ప్రతినిధి బృందానికి రాయబారి సమీహ్ ఎస్సా జోహార్ హయత్, కువైట్ ఆసియా వ్యవహారాల సహాయ మంత్రి (AFM) నేతృత్వం వహించారు. ఇరు దేశాల రాయబారులతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు కూడా ఎఫ్‌ఓసిలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రెండు దేశాల మధ్య చారిత్రాత్మక, స్నేహపూర్వక సంబంధాలను గుర్తుచేసుకున్నారు. సంబంధాన్ని మరింత బలోపేతం చేయడం, వైవిధ్యపరచవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అదే విధంగా కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబా.. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌ను ఉద్దేశించి రాసిన ఒక లేఖను భారత బృందానికి అందజేశారు. సమావేశం సందర్భంగా ఇరు పక్షాలు ద్వైపాక్షిక సహకారం వివిధ అంశాల సమగ్ర సమీక్షను చేపట్టాయి. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. వివిధ రంగాలలో.. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సైన్స్, హై-టెక్నాలజీ, ఆరోగ్యం, పర్యాటకం మొదలైన వాటిలో సహకారాన్ని వైవిధ్యపరచడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. తదుపరి ఎఫ్‌ఓసీని కువైట్‌లో పరస్పరం అనుకూలమైన సమయంలో నిర్వహించేందుకు ఇరుపక్షాలు అంగీకరించారు.
తాజా వార్తలు
- వైజాగ్ ఆర్కే బీచ్‌లో కేఎఫ్‌సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి









