గో ఫస్ట్ విమానాలు రద్దు.. ఇండియా-యూఏఈ ప్రయాణికులపై ప్రభావం..!

- May 03, 2023 , by Maagulf
గో ఫస్ట్ విమానాలు రద్దు.. ఇండియా-యూఏఈ ప్రయాణికులపై ప్రభావం..!

యూఏఈ: మే 3, 4, 5వ తేదీల్లో క్యారియర్ విమానాలను రద్దు చేయడంతో బారత్-యూఏఈ మధ్య అత్యంత తక్కువ ధర కలిగిన ఎయిర్‌లైన్ గో ఫస్ట్‌తో ప్రయాణించడానికి బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ ఎయిర్‌లైన్ భారతదేశంలోని అనేక నగరాల నుండి అబుధాబి, దుబాయ్‌లకు సర్వీసులను అందిస్తోంది. యూఏఈలోని ట్రావెల్ ఏజెంట్లు మాట్లాడుతూ చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాల్లో రీబుక్ చేసుకుంటున్నారని తెలిపారు.  మే 3-5 తేదీల మధ్య షెడ్యూల్ చేయబడిన విమాన సర్వీసులను "ఆపరేషన్ కారణాల వల్ల" రద్దు చేయబడినట్లు ఎయిర్‌లైన్ తన వెబ్ సైట్లో వెల్లడించింది. “విమానాలు రద్దు చేయడం వల్ల కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. త్వరలోనే టికెట్లు రద్దయిన వారికి పూర్తి వాపసు చేయబడుతుంది. ”అని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com