పత్రికా స్వేచ్ఛలో ఎనిమిది స్థానాలు ఎగబాకిన ఒమన్

- May 04, 2023 , by Maagulf
పత్రికా స్వేచ్ఛలో ఎనిమిది స్థానాలు ఎగబాకిన ఒమన్

మస్కట్: రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఇండెక్స్ ప్రకారం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023లో ఒమన్ సుల్తానేట్ ఎనిమిది స్థానాలు ఎగబాకింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఈ జాబితాను ప్రచురించారు. ఒమన్ సుల్తానేట్ ఈ సంవత్సరం సూచికలో ప్రపంచవ్యాప్తంగా 155వ స్థానంలో ఉంది. 2022 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 163వ స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో నార్వే అగ్రస్థానంలో ఉండగా.. ఐర్లాండ్, డెన్మార్క్ ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. ఇక  ర్యాంకింగ్ చివరి ర్యాంకుల్లో వరుసగా  ఉత్తర కొరియా, చైనా, వియత్నాం, ఇరాన్ ఉన్నాయి. అనుమతించబడిన పత్రికా స్వేచ్ఛ ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. జాబితాలో ఉన్న 180 దేశాలలో  70% పేద దేశాలు ఉన్నట్లు నివేదికలో తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com