APSRTC ఎండీతోపాటు మరో నలుగురు అధికారులకు జైలు శిక్ష
- May 04, 2023
అమరావతి: ఆదేశాలను ధిక్కరించిన అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగానూ ఐదుగురు అధికారులకు నెల రోజులు జైలు శిక్ష విధించింది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీతోపాటు మరో నలుగురికి నెల రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్ మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులపై ఫీల్డ్ మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతోపాటు మరో ముగ్గురు అధికారులకు నెల రోజులు జైలు శిక్ష విధించడంతోపాటు రూ.1000 జరిమానా విధించింది. అంతేకాకుండా మే16వ తేదీలోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







