వారంలో అన్ని రోజులు వాహన పరీక్ష సేవలు
- May 06, 2023
దుబాయ్ : దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) 30 ఏప్రిల్ నుండి ఆదివారాలతో సహా వారంలోని అన్ని రోజులలో వాహన సాంకేతిక పరీక్ష సేవలను శాశ్వతంగా అమలు చేస్తుంది. రస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రెండు నెలల విజయవంతమైన ట్రయల్ అనంతరం నాలుగు కేంద్రాలకు ఈ సేవలను ఆర్టీఏ విస్తరించింది. “సాంకేతిక పరీక్ష సేవ ఇప్పుడు ఆదివారాలు కూడా శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. అల్ అవీర్, అల్ తవార్, ఆటోప్రో అల్ మంఖూల్ మరియు ఆటోప్రో అల్ సత్వాలో ఉన్న ENOC తస్జీల్ కేంద్రాలతో అనుబంధంగా ఉన్న పరీక్షా కేంద్రాలకు విస్తరించాం.’’ అని ఆర్టీఏ ప్రకటించింది. ట్రయల్ పీరియడ్‌లో వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆర్టీఏ వాహన లైసెన్సింగ్ డైరెక్టర్ అహ్మద్ మహబూబ్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







