మరో ‘కశ్మీరీ ఫైల్స్’.! ‘ది కేరళ స్టోరీ’.!

- May 06, 2023 , by Maagulf
మరో ‘కశ్మీరీ ఫైల్స్’.! ‘ది కేరళ స్టోరీ’.!

గతంలో హిందీలో తెరకెక్కిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ సినిమా ఏ స్థాయిలో సంచలనమైందో తెలిసిందే. నిజానికి ఈ సినిమా నెగిటివిటీతో మొదలై సంచలన విజయంగా నిలిచింది. అనూహ్యమైన వసూళ్లు కొల్లగొట్టింది.

ఇప్పుడీ తరహాలోనే ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదాస్పదమవుతోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా కాన్సెప్ట్ వుందని ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయాలని విమర్శలు వినిపిస్తున్నాయ్. 

ఇంత వ్యతిరేకత వున్న ‘ది కేరళ స్టోరీ’ మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. వివాదాలు వెంటాడుతున్నా సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. లవ్ జిహాదీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఓ వర్గం ముశ్లిం కమ్యూనిటీతో పాటూ, కొందరు హిందూ వ్యతిరేక సామాజిక వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నాయ్.

అయినా ఓ వర్గం సామాజిక వర్గం ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. దాంతో, ఈ సినిమా గురించిన చర్చ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా నడుస్తోంది. ఇదే ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది. మొత్తానికి నెగిటివ్ పబ్లిసిటీతో కూడా సినిమాలు సంచలన విజయాలందుకుంటాయ్ అని ‘ది కేరళ స్టోరీ’ మరోసారి ప్రూవ్ చేసినట్లయ్యింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com