కిడ్నీ సమస్యలున్న వాళ్లు కొబ్బరి నీళ్లు తాగకూడదా.?

- May 06, 2023 , by Maagulf
కిడ్నీ సమస్యలున్న వాళ్లు కొబ్బరి నీళ్లు తాగకూడదా.?

కొబ్బరి నీళ్లు ఎప్పుడూ ఆరోగ్యదాయకమే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏ రోగికి అయినా మొదట వైద్యులు ప్రిఫర్ చేసే ఫుడ్ కొబ్బరి నీళ్లు. ఈజీగా డైజెస్ట్ అయిపోవడంతో పాటూ, రోగికి తక్షణ శక్తిని అందించడంలో కొబ్బరి నీళ్లు కీలక పాత్ర వహిస్తాయ్.

ముఖ్యంగా వేసవిలో డీ హైడ్రేషన్ సమస్య నుంచి దూరంగా వుంచేందుకు కొబ్బరి నీళ్లు సహాయ పడతాయ్. అయితే, కిడ్నీ సంబంధిత రోగులు కొబ్బరి నీళ్లకు దూరంగా వుండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా వుంటుంది. ఇది కిడ్నీలపై ఎక్కువ ప్రభావితం చేస్తుంది. తద్వారా కిడ్నీ సమస్యలు వున్నవాళ్లు మరింత ప్రమాదంలో పడే అవకాశాలుంటాయ్. వైద్యుని సలహా తీసుకోకుండా కిడ్నీ సంబంధిత రోగులు కొబ్బరి నీళ్లు తాగరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అలాగే శస్త్ర చికిత్సకు ముందు కొబ్బరి నీళ్లు తీసుకోరాదని చెబుతున్నారు. సర్జరీ సమయాల్లో రక్తపోటు సమతుల్యంగా వుండాలి. కానీ, కొబ్బరి నీళ్లు రక్తపోటును తగ్గించేస్తాయ్. 

సాధారణ పరిస్థితుల్లోనూ తక్కువ రక్తపోటు వున్న వాళ్లు కొబ్బరి నీళ్లు తీసుకోరాదని హెచ్చరిక. అధికంగా కొబ్బరి నీళ్లు తీసుకునే అలవాటుంటే తగ్గించుకోవాలి. పొటాషియం ఎక్కువగా వుండే కొబ్బరి నీళ్లు అతిగా తాగడం వల్ల పక్షపాతం వచ్చే ప్రమాదాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com