చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
- May 07, 2023
న్యూ ఢిల్లీ: పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లి 46 బంతుల్లో 55 పరుగులు చేశాడు. వ్యక్తిగత స్కోరు 12 పరుగుల వద్ద ఐపీఎల్(IPL)లో ఏడువేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా అవతరించాడు. ఈ ఘనతను అతడు తన సొంత మైదానంలో అందుకోవడం విశేషం. విరాట్ 233 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించాడు. ఐదు శతకాలు, 49 అర్ధశతకాలు కోహ్లి ఖాతాలో ఉన్నాయి.
ఇప్పటికే ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతడి తరువాత శిఖర్ ధావన్(6536), డేవిడ్ వార్నర్(6189), రోహిత్ శర్మ(6063) లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







