ఒమన్‌లో వేర్వేరు ఘటనల్లో పది రోజుల్లో ఎనిమిది మంది మృతి
- May 07, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో పది రోజుల్లో వేర్వేరు సంఘటనల్లో ఎనిమిది మంది మరణించారు. నీటిలో మునిగిపోవడం, ఇసుక కుప్పకూలడం, గ్యాస్ లీకేజీల కారణంగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 26 నుండి మే 6 వరకు అధికారికంగా లేదా సోషల్ మీడియా ద్వారా ప్రకటించబడిన అనేక దురదృష్టకర ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా పని ప్రదేశాలలో, రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా వర్షం సమయంలో ప్రజలు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) పిలుపునిచ్చింది.
దంపతులు మృతి
అల్ షర్కియా సౌత్ గవర్నరేట్‌లోని జాలాన్ బనీ బు అలీ లోయలో వాహనం కూరుకుపోయిన ఘటనలో భార్య, ఆమె భర్త చనిపోయారు.
నీటమునిగి యువకుడు మృతి
21 సంవత్సరాల వయస్సు గల మొహమ్మద్ డి అల్-రహ్బీ తప్పిపోయిన మూడు రోజుల తర్వాత దిమా వాల్'తైయిన్ విలాయత్‌లోని వాడి దయఖాలో అతని మృతదేహాన్ని సీడీఏఏ బృందాలు గుర్తించాయి. ఏప్రిల్ 29న ఉదయం 11 గంటలకు దిమా వాల్'తైయిన్ విలాయత్ ప్రాంతంలోని (టౌల్) పర్వతాలలో స్నేహితులతో నడుచుకుంటూ.. వాడి దయఖా ఆనకట్ట వైపు వెళుతున్న క్రమంలో లోయ ప్రవాహంలో అతని కాలు జారి వరదలో కొట్టుకుపోయాడు.
గ్యాస్ లీక్ వల్ల..యువకుడు మృతి
అల్-వుస్తా గవర్నరేట్‌లోని ముఖైజ్నా ఫీల్డ్‌లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకేజీ ప్రమాదం కారణంగా యాహ్యా అల్-అన్బౌరీ అనే వ్యక్తి మరణించాడు. లీకేజీ వల్ల మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆయిల్ అండ్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ ట్వీట్ చేసింది.
కొండచరియలు విరిగి.. నలుగురు మృతి
నఖల్‌లోని విలాయత్‌లోని వాకాన్ గ్రామానికి వెళ్లే రహదారిపై ఒక కంపెనీ నిర్వహణ పనులు చేస్తుండగా ముగ్గురు కార్మికులపై ఇసుక కూలడంతో మరణించారు. మృతులను బంగ్లాదేశ్ జాతీయులుగా గుర్తించారు.
నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లో బిడియాలోని విలాయత్‌లోని అల్ ముంట్రెబ్లోని ఒక పొలంలో బావిని తవ్వుతుండగా.. ఇసుక కూలి ఆసియా జాతీయతకు చెందిన ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. అందులో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









