అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించాలి: పవన్ కళ్యాణ్
- May 07, 2023
హైదరాబాద్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్దంతి సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనను స్మరించుకున్నారు. వీరులకు పుట్టుకే కానీ గిట్టుక ఉండదని, వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందని తెలిపారు. వారు రగిల్చిన విప్లవాగ్ని ఎప్పటికీ ఆరిపోదని పేర్కొన్నారు. అటువంటి ధీరుడే మన అల్లూరి సీతారామరాజు అని వెల్లడించారు.
ఆ మహా యోధుడు వీరమరణం పొంది నేటికి వందేళ్లు అని పవన్ పేర్కొన్నారు. నేటి తరం దేశవాసులందరికీ అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ, మృత్యువుకు భయపడని నైజం, జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలని అభిప్రాయపడ్డారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలని పవన్ కల్యాణ్ కోరారు. అల్లూరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను తాము స్వీకరిస్తామని పవన్ ప్రకటించారు. అల్లూరి స్ఫూర్తిని దేశమంతా చాటాలని జనసేనాని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









