2023లో 22 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన అష్ఘల్
- May 08, 2023
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) 2023లో QR 4.1 బిలియన్ విలువైన 22 కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. ఇందులో కీలకమైన హమద్ మెడికల్ కార్పొరేషన్ అభివృద్ధి, మదీనత్ ఖలీఫా హెల్త్ సెంటర్ భవనం, ఖతార్ అకాడమీ సిద్రా, మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ వెటర్నరీ లాబొరేటరీల అభివృద్ధి లాంటి 10 ప్రాజెక్ట్‌లు సుమారుగా QR 3bn విలువ కలిగి ఉన్నాయని అష్ఘల్ ప్రాజెక్ట్స్ అఫైర్స్ డైరెక్టర్, ఎంగ్ యూసెఫ్ అల్ ఎమాది వెల్లడించారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మరిన్ని ప్రాజెక్టులకు అష్ఘల్ టెండర్ వేయనుందని, రాష్ట్ర ప్రణాళిక ప్రకారం మౌలిక సదుపాయాలు మరియు పబ్లిక్ భవనాల ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు అల్ ఎమాది తెలిపారు. కోర్ట్ కాంప్లెక్స్, కోర్ట్ ఆఫ్ కాసేషన్, అల్ తుమామా మెయిన్ పోస్టాఫీస్ బిల్డింగ్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కస్టమ్స్ బిల్డింగ్‌తో సహా ప్రాజెక్టుల రూపకల్పన ప్రణాళికలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. డిజైన్‌లో ఉన్న ఆరు ప్రాజెక్ట్‌లలో రెండు కోర్ట్ కాంప్లెక్స్ మరియు కోర్ట్ ఆఫ్ అప్పీల్ అండ్ కాసేషన్ ఉన్నాయని, ఇది ప్రధాన పోస్టాఫీసు రూపకల్పనతో పాటు అత్యంత అందమైన నిర్మాణ ఆలోచనను పొందేందుకు డిజైన్ పోటీని ఇటీవల ప్రకటించినట్లు పేర్కొన్నారు. 2023 మూడో త్రైమాసికంలో మరో ప్రాజెక్టును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









