రస్ అల్ ఖైమాలో పర్వతం నుండి పడి ఎమిరాతి మృతి
- May 08, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమాలో పర్వతం నుండి పడి ఓ ఎమిరాతి పౌరుడు మరణించాడు. స్థానిక అరబ్ మీడియా ప్రకారం.. ఓ ఎమిరాతి వ్యక్తి విహారయాత్రకు వెళ్ళాడు. కానీ ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని బంధువులు, ఇతర స్థానికులు తప్పిపోయినట్లు అధికారులకు సమాచారం అందించారు. అల్ రామ్‌లోని సమగ్ర పోలీసు కేంద్రంతో పాటు సెర్చ్, రెస్క్యూ, జాతీయ అంబులెన్స్ విభాగానికి చెందిన సభ్యులతో సెర్చ్ ఆపరేషన్ ను రస్ అల్ ఖైమాలోని అధికారులు చేపట్టారు. కొంతమంది స్థానికులు కూడా ఇందులో పాల్గొన్నారు. కాగా, పర్వతం నుంచి పడి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









