1.2 మిలియన్లకు పైగా యాంఫేటమిన్ మాత్రలు సీజ్
- May 08, 2023
రియాద్: రియాద్‌లోని అల్-ముజాహ్మియా గవర్నరేట్‌లోని రెస్ట్ హౌజ్ లో 1.2 మిలియన్లకు పైగా యాంఫెటమైన్ మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా విభాగ ప్రత్యేక ప్రతినిధి మాట్లాడుతూ.. విశ్రాంతి గృహంపై దాడి చేసి 7 మందిని అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి దాదాపు 1,266,000 నార్కోటిక్ యాంఫెటమైన్ టాబ్లెట్లను గుర్తించి సీజ్ చేశామన్నారు.7 మంది నిందితులలో ఈజిప్టు, సిరియన్, బంగ్లాదేశ్ దేశాల ప్రవాసులు ఉన్నారని, అలాగే ఇద్దరు యెమెన్‌లతో పాటు ఇద్దరు సౌదీ పౌరులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. నిందితులను అరెస్టు చేసి, వారిపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, ఆ తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించామని ప్రతినిధి తెలిపారు. సౌదీ అరేబియా యువత భద్రతను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్స్ స్మగ్లింగ్, ప్రమోషన్ నెట్‌వర్క్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









