13 మంది ఉగ్ర అనుమానితుల విడుదల
- May 10, 2016
ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారిగా భావించి అరెస్టు చేసిన పది మందిని విడుదల చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. వారి వద్ద సరైన ఆధారాలు లభించకపోవడంతో విడిచిపెట్టినట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ దీప్ తెలిపారు. మే3న జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్నవారిగా భావించిన 13 మందిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
వారిలో నలుగురిని శనివారం విడుదల చేయగా, సోమవారం ఆరుగురిని విడుదల చేసినట్లు చెప్పారు. సైకాలజిస్టులతో వారికి కౌన్సిలింగ్ ఇప్పించినట్లు చెప్పారు. దిల్లీ పోలీస్ యాంటీ టెర్రరిజం యూనిట్ స్పెషల్ సెల్ పోలీసులు... దిల్లీ, ఉత్తర ప్రదేశ్ల నుంచి మొత్తం 13మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించిన తర్వాత ముగ్గుర్ని అప్పుడే వదిలేయగా మిగిలిన పది మందిని రెండు విడతల్లో విడిచిపెట్టారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







