‘గో ఫస్ట్’కు డీజీసీఏ నోటీసులు
- May 09, 2023
కువైట్: విమానాలను ఆకస్మికంగా రద్దు చేయడంపై గో ఎయిర్‌లైన్స్ (ఇండియా) లిమిటెడ్ (గో ఫస్ట్)కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గో ఫస్ట్ IBC కింద కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937 నిబంధనలు, సురక్షితమైన, సమర్ధవంతమైన, నమ్మదగిన రీతిలో సేవ ఆపరేషన్‌ను కొనసాగించడంలో గో ఫస్ట్ వైఫల్యం చెందినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసు అందిన 15 రోజుల్లోగా తమ ప్రత్యుత్తరాన్ని సమర్పించాల్సిందిగా ఎయిర్‌లైన్ ఆపరేటర్‌ను కోరడం జరిగింది. వారు సమర్పించిన ప్రత్యుత్తరం ఆధారంగా వారి ఎయిర్ ఆపరేటర్ల సర్టిఫికెట్ (AOC) కొనసాగింపుపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. ఆపరేషన్ కార్యక్రమాల కారణాల వల్ల మే 12 వరకు అన్ని విమానాలను రద్దు చేసినట్లు గో ఫస్ట్ విమానయాన సంస్థ శుక్రవారం తెలిపింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







