జూన్ 8న జమ్మూలో వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ- టీటీడీ చైర్మన్
- May 09, 2023
తిరుమల: జూన్ 8న జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైష్ణోదేవి యాత్రకు వెళ్లే భక్తులు వెంకన్నను దర్శించుకునే సదుపాయం కల్పిస్తామన్నారు. భక్తులు శ్రీవారి ఆశీస్సులు కూడా తీసుకోవచ్చన్నారు. జమ్మూలో మజీన్ గ్రామంలో టీటీడీ నూతనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించింది. ఆలయంలో జరుగుతున్న పనులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
దూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించగా, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామన్నారు.
- జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ.
- జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ.
- 12 గంటలకు భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభం.
- శ్రీ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే జమ్మూ-కాట్రా మార్గంలో నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయం.
తాజా వార్తలు
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







