మహ్జూజ్ డ్రా: 1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసులు

- May 10, 2023 , by Maagulf
మహ్జూజ్ డ్రా: 1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసులు

యూఏఈ: భారతీయ ప్రవాసుడు సుమైర్(36) 2020లో కోవిడ్-19 సమయంలో ఉద్యోగం కోల్పోయాడు. అంతకుముందు ఆరేళ్ల నుంచి యూఏఈలో నివసిస్తున్నారు. ఇప్పుడు, అదృష్టం అతని తలుపు తట్టింది. మహ్జూజ్ డ్రా లో అతను లక్షాధికారి అయ్యాడు. ప్రస్తుతం అతను ఖతార్ లో చమురు, గ్యాస్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. తన బహుమతి మొత్తంలో కొంత భాగాన్ని ఇళ్లు కొనుగోలుకు వెచ్చిస్తానని, కొంద మొత్తాన్ని చారిటీలకు ఇస్తానన్నారు.

ఖతార్‌లోని మరో భారతీయ ప్రవాసుడు తాజా డ్రాలో రాఫిల్ బహుమతిని గెలుచుకున్నాడు. మెకానికల్ ఇంజనీర్ అయిన షహబాజ్ తొమ్మిదో గ్యారంటీ మిలియనీర్ అయ్యాడు. అతను రెండు సంవత్సరాలుగా మహ్జూజ్‌లో పాల్గొంటున్నాడు. "నేను నా స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో లైవ్ డ్రాను చూశాను. స్క్రీన్‌పై నా పేరు చూడగానే ఎగిరిపోయాను" అని షాహబాజ్ చెప్పారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com