మొట్టమొదటి లేబర్ మార్కెట్ అవార్డును ప్రకటించిన యూఏఈ
- May 10, 2023
యూఏఈ: యూఏఈలోని గృహ కార్మికులు, కార్మికులు, కంపెనీలు, వ్యాపారులకు మొట్టమొదటి సారిగా ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డును అందజేయనున్నారు. మూడు కేటగిరీలుగా విభజించబడిన ఈ అవార్డు.. ఉత్తమ ప్రదర్శన చూపే కార్మికులు, కంపెనీలను ప్రోత్సహిస్తుంది. కార్మిక మార్కెట్‌ను మెరుగుపరచడం, కంపెనీల పని వాతావరణాన్ని గుర్తించడం, ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని పెంచడం, పోటీతత్వాన్ని పెంపొందించడంతోపాటు దేశంలోని శ్రామికశక్తి శ్రేయస్సును మెరుగుపరచడానికి ఈ అవార్డు దోహదం చేస్తుందని ఎమిరటైజేషన్ (మోహ్రే) మంత్రి డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్ అవార్ అన్నారు.
మొత్తం 28 కంపెనీలు ఆరు కేటగిరీల్లో వాటి పరిమాణం ఆధారంగా గుర్తించబడతాయి. ప్రతి విభాగంలో నలుగురు విజేతలతో, నైపుణ్యం, నైపుణ్యం లేని మరియు సాధారణ విభాగాల్లో ఉద్యోగులు గుర్తించి అవార్డులను అందజేస్తారు. గృహ కార్మికుల రిక్రూట్మెంట్, ఉపాధి ఏజెన్సీలు, వ్యాపార కేంద్రాలు అనే మూడు విభాగాలలో వ్యాపారాలకు అవార్డులతో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







