ఉమ్రా యాత్రికుల వీసా గడవు పొడిగింపు.. ప్రత్యేక హోస్టింగ్ పథకం ప్రారంభం
- May 11, 2023
సౌదీ: సూడాన్‌లో కొనసాగుతున్న సంఘర్షణతో ప్రభావితమైన యాత్రికులకు మద్దతుగా కొత్త కార్యక్రమాలను సౌదీ అరేబియా అధికారులు ప్రకటించారు. ఇప్పుడు, ఈ సందర్శకులు రాజ్యంలో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్‌లు సుడానీస్ యాత్రికులకు మంజూరు చేయబడిన వీసాల చెల్లుబాటును పొడిగించే విధానాలను ప్రారంభించాయి. మక్కా రీజియన్ అడ్మినిస్ట్రేషన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో కొత్త పథకానికి సంబంధించిన విషయాలను పేర్కొన్నారు.
బాధిత యాత్రికులు ఆన్‌లైన్ అబ్షర్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేక 'హోస్టింగ్' సేవ కింద దరఖాస్తు చేసుకోవాలి. ఈ సేవ ద్వారా పౌరులు, ప్రవాసులు సుడానీస్ జాతీయులకు హోస్ట్‌లుగా పని చేయవచ్చు. యాత్రికుల ఉమ్రా వీసాలను "కుటుంబ సందర్శన వీసాలు లేదా వ్యక్తిగత"గా మార్చుకోవచ్చు. అయితే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలనుకునే వారు అబ్షర్ వెబ్‌సైట్‌ను మరిన్ని వివరాల కోసం చూడాలని పాస్‌పోర్ట్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







