హైదరాబాద్ విమానాశ్రయంకు మరో అరుదైన గుర్తింపు...

- May 11, 2023 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయంకు మరో అరుదైన గుర్తింపు...

హైదరాబాద్: GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత సమయపాలన (పంక్చువల్) కలిగిన విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ సిరియమ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్చి'23 నెలలో 90.43% ఆన్-టైమ్ పెర్ఫామెన్స్(OTP)ను నమోదు చేసింది. (https://resources.cirium.com/monthly-otp-2023#page=1). ఈ నివేదికలో ప్రపంచంలోనే 90% మార్కును దాటిన ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం.

సిరియమ్ మార్చి'23 నెలలో ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్లకు పైగా విమానాలను సమీక్షించింది. HYD విమానాశ్రయం 'గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్', 'లార్జ్ ఎయిర్‌పోర్ట్స్' విభాగాలు రెండింటిలో అగ్రస్థానంలో నిలిచింది. HYD విమానాశ్రయం నవంబర్'22లో 88.44% OTPతో 'లార్జ్ ఎయిర్‌పోర్ట్స్' విభాగంలో 4వ స్థానంలో నిలిచింది. వాస్తవ నిష్క్రమణ సమయం (actual gate departure) 80% లేదా మెరుగైన కవరేజీని కలిగి ఉన్న వాస్తవ గేట్ డిపార్చర్ (actual gate departure) సర్వీస్, మరియు మూడు ప్రాంతాలకు (అది ఉన్న ప్రాంతం సహా) సేవలు అందించే విమానాశ్రయాల ప్రాతిపదికగా దీనిని నిర్ణయించారు.  

ప్రదీప్ పణికర్, CEO-GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, “మా విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే అత్యంత సమయపాలన కలిగిన ఎయిర్‌పోర్ట్‌గా గుర్తించినందుకు సంతోషిస్తున్నాము. నిరాటంకమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం, ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని సమయానికి చేరుకునేలా చేయడంలో మా అచంచలమైన నిబద్ధతకు ఇది నిదర్శనం. చాలా ఏళ్లుగా మేము నూతన సాంకేతిక ఆవిష్కరణలను అమలు చేస్తూ, మా కార్యాచరణ పద్ధతులను మెరుగుపరచాము. విమానాశ్రయ పనితీరును మరింత పెంచడం కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించాము. ప్రయాణికులు సాఫీగా ప్రయాణించేలా చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మా ఎయిర్‌లైన్ భాగస్వాములు, ఇతర వాటాదారులు, మా సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’’ అన్నారు.

GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం నుంచి దేశంలోని విమానాశ్రయ రంగానికి అనేక నూతన సాంకేతిక ఆవిష్కరణలను అందించింది, ఇందులో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మరియు సెంట్రలైజ్డ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (AOCC), ఇతర ఆధునిక ప్రయాణీకుల సమాచార వ్యవస్థలు, సాంకేతిక ఆవిష్కరణలున్నాయి. GHIAL యొక్క ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్-ఇన్, సెల్ఫ్ చెకిన్ కియోస్క్‌లు, E బోర్డింగ్, వీడియో అనలిటిక్స్ మొదలైన ఆవిష్కరణలు ఎయిర్‌లైన్ భాగస్వాముల ఆన్ టైమ్ పెర్ఫామెన్స్‌ను (OTP) ప్రభావితం చేసాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com