హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్న లండన్ స్టాక్ ఎక్స్చేంజ్

- May 12, 2023 , by Maagulf
హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్న లండన్ స్టాక్ ఎక్స్చేంజ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ యునైటెడ్  కింగ్ డమ్ (UK) పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకు వచ్చింది. ఈ కేంద్రం ఎర్పాటు ద్వారా సుమారు 1000 మందిని ఈ సంవత్సరాంతానికి నియమించుకోనున్నట్లు సంస్ధ తెలిపింది. మంత్రి  మరియు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సి ఐ ఓ అంతోని మేక్ కార్తీ (Anthony McCarthy) తో జరిగిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. హైదరాబాదులో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎర్పాటుకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్, ఎన్నారై అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మరియు అంతోనీ మెక్ కార్తీ మద్య మంత్రి కేటీఆర్  సమక్షంలో జరిగింది. 

లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసే టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ ద్వారా హైదరాబాద్ నగరంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ రంగానికి అద్భుతమైన ఊతం లభిస్తుంది. ఈ రంగంలో హైదరాబాద్ నగరంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించనుంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ప్రపంచంలో 70 దేశాలలో ఫైనాన్షియల్ మార్కెట్ రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దాదాపు 190 దేశాలలోని తన ఖాతాదారులకు సేవలను అందిస్తుంది. తన విస్తృతమైన కార్యకలాపాలతో ప్రపంచంలోని ఫైనాన్షియల్  సేవారంగంలో దిగ్గజ సంస్ధగా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ఒకటిగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com