కర్ణాటక ఎలక్షన్ 2023: ఆధిక్యంతో దూసుకుపోతున్న కాంగ్రెస్..
- May 13, 2023
బెంగుళూరు: కర్ణాటక ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యాక సాయంత్రానికల్లా కాంగ్రెస్ గెలుపు అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఈరోజు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుండటం చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మొదటిరౌండ్ ఫలితాలు వచ్చేసరికే కాంగ్రెస్ 125 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. బీజేపీ మాత్రం 80 ..85 మధ్యలో ఉంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఆధిక్యంలో దూసుకుపోతున్న క్రమంలో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక గెలుపు తమదే అనే ధీమా వ్యక్తంచేస్తున్నారు. గెలుపుపై బీజేపీ నేతలు వేసిన సెటైర్లకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరగ్గా ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నానికి ఫలితాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందిన ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ 120 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 70, జేడీఎస్ 22, ఇతరులు కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమై ఉన్నారు.
ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశాయి. ముఖ్యంగా ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ ఫుల్ ఎఫెట్ పెట్టింది. కర్ణాటక ఎన్నికల బేస్ తో తెలంగాణలో కూడా విజయం కోసం వేచి చూస్తోంది.కర్ణాటకలో ఏ పార్టీ గెలుస్తుందో తెలంగాణలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయా పార్టీలు అంచనాలు వేశారు. దీంతో కర్ణాటక ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టాయి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు. ఈక్రమంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతున్న క్రమంలో గెలుపు సాధించి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందా? అనేది వేచి చూడాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అవి నిజం కావడం ఖాయమని అనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష