మహారాష్ట్రలో విషాదం
- May 13, 2023
మహారాష్ట్ర: మహారాష్ట్ర పర్భానీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ ని శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన సోన్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌచా తండాలో చోటు చేసుకుంది.
పోలీసుల తెలిపిన ప్రకారం..ఆరుగురు కూలీలు ఓ పొలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగారు. ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఐదుగురు కార్మికులు అక్కడికి చేరుకునేలోపే మరణించినట్లు తెలిపారు. సోన్‌పేట్ పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారి తెలిపారు. ఈ ఘటన తో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







