వ్యూస్ కోసం ఏకంగా విమానాన్నే కూల్చిన యూట్యూబర్..
- May 13, 2023
అమెరికా: వ్యూస్ కోసం ఏకంగా విమానాన్నే కూల్చిన ఓ యూట్యూబర్ చిక్కుల్లో పడ్డాడు. వ్యూస్ కోసం తన విమానాన్ని ఉద్ధేశపూర్వకంగా కూల్చిన యూట్యూబర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అమెరికన్ అధికారులు తెలిపారు. ఫెడరల్ విచారణను అడ్డుకోవాలని దాచిన నేరాన్ని ట్రెవర్ జాకబ్(29) ఒప్పుకున్నాడు. అతడు చేసిన నేరానికి ఫెడరల్ ప్రిజన్ లో గరిష్టంగా 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
యూట్యూబర్ అప్ లోడ్ చేసిన విమానం కూలిన వీడియోను ఏకంగా 30 లక్షల మంది వీక్షించారు. నిందితుడు ట్రైవర్ జాకబ్ పైలట్ లైసెన్స్ ను అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. కాలిఫోర్నియాలోని లాస్ పడ్రెస్ నేషనల్ ఫారెస్టులో 2021 డిసెంబర్ లో తాను కూల్చిన సింగిల్ ఇంజిన్ విమానం శిథిలాలను జాకబ్ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాడని అధికారులు తెలిపారు.
‘నా విమానాన్ని కూల్చివేశాను’ అనే టైటిల్ తో కూడిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో సింగిల్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బయటకు దూకిన జాకబ్ ప్యారాచూట్ సాయంతో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. విమానం అంతటా అమర్చిన కెమెరాలు ప్లేన్ నియంత్రణ కోల్పోయి అడవిలోకి దిగి చివరికి క్రాష్ ల్యాండింగ్ అవడాన్ని చూపాయి.
ఈ వీడియో క్లిప్ పై ఏవియేషన్ ఔత్సాహికులు తీవ్రంగా మండిపడ్డారు. ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను జాకబ్ సంప్రదించలేదని, ఇంజన్ ను తిరిగి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నం చేయలేదని ఏవియేషన్ అధికారులు గుర్తించారు. సేఫ్ ల్యాండింగ్ అయ్యేందుకు పలు ప్రదేశాలున్నా ల్యాండ్ చేయలేదని తెలిపారు.
విమానం కుప్పకూలగానే బయటపడిన యూట్యూబర్ విమానం శిథిలాలను ధ్వంసం చేశారని ఎఫ్ఏఏ అధికారులు వెల్లడించారు. అయితే, నేరానికి పాల్పడిన యూట్యూబర్ జాకబ్ కు కోర్టు త్వరలో శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







