ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే అదొక్కటే మార్గం సుమా.!
- May 13, 2023
ఒత్తిడి, స్ర్టెస్.. ఇలా పేరేదైనా ఇది మానవ జీవితంలో ఒకప్పటితో పోల్చితే చాలా చాలా ఎక్కువైపోయింది. స్పీడుగా ఎదిగిన, ఎదుగుతోన్న సొసైటీనీ, టెక్నాలజీని అందుకోవడానికి యువత కాదు, కాదు, యావత్ ప్రపంచం పడుతోన్న తంటా అంతా ఇంతా కాదు.
ఆ క్రమంలోనే తీవ్రమైన ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయ్. ఎక్కువ సమయం విశ్రాంతి లేకుండా పని చేసేవారికి ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువవుతోంది.
ఒత్తిడిని తట్టుకోలేక కొన్ని పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిని కూడా తెచ్చుకోవల్సి వస్తోంది. ఒత్తిడిని తట్టుకోవడానికి ఒకే ఒక మార్గం వ్యాయాయం.
అది వాకింగ్, జాగింగ్, యోగా ఏ మార్గంలోనైనా అవలంభించవచ్చు. మంచి ఫలితం వుంటుంది. కనీసం రోజులో అరగంటైనా ఇందుకోసం టైమ్ కేటాయించాలి.
ఒత్తిడికి గురైనప్పుడు మన కండరాల్లో టెన్షన్ మొదలవుతుంది. దాంతో పటుత్వంలో తేడా వస్తుంది. ఆ సమయంలో వేడి నీటితో స్నానం చేస్తే మంచి పలితం వుంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడిని తట్టుకోవాలంటే మరో ముఖ్యమైన అంశం నిద్ర. చేసే పనిని బట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా వుండాల్సిందే.
సౌష్టికాహారం తీసుకుంటూ చేసే పనులను టైమ్ ప్రకారం విభజించుకుంటూ సిస్టమేటిక్‌గా పూర్తి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …