ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే అదొక్కటే మార్గం సుమా.!
- May 13, 2023ఒత్తిడి, స్ర్టెస్.. ఇలా పేరేదైనా ఇది మానవ జీవితంలో ఒకప్పటితో పోల్చితే చాలా చాలా ఎక్కువైపోయింది. స్పీడుగా ఎదిగిన, ఎదుగుతోన్న సొసైటీనీ, టెక్నాలజీని అందుకోవడానికి యువత కాదు, కాదు, యావత్ ప్రపంచం పడుతోన్న తంటా అంతా ఇంతా కాదు.
ఆ క్రమంలోనే తీవ్రమైన ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయ్. ఎక్కువ సమయం విశ్రాంతి లేకుండా పని చేసేవారికి ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువవుతోంది.
ఒత్తిడిని తట్టుకోలేక కొన్ని పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిని కూడా తెచ్చుకోవల్సి వస్తోంది. ఒత్తిడిని తట్టుకోవడానికి ఒకే ఒక మార్గం వ్యాయాయం.
అది వాకింగ్, జాగింగ్, యోగా ఏ మార్గంలోనైనా అవలంభించవచ్చు. మంచి ఫలితం వుంటుంది. కనీసం రోజులో అరగంటైనా ఇందుకోసం టైమ్ కేటాయించాలి.
ఒత్తిడికి గురైనప్పుడు మన కండరాల్లో టెన్షన్ మొదలవుతుంది. దాంతో పటుత్వంలో తేడా వస్తుంది. ఆ సమయంలో వేడి నీటితో స్నానం చేస్తే మంచి పలితం వుంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడిని తట్టుకోవాలంటే మరో ముఖ్యమైన అంశం నిద్ర. చేసే పనిని బట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా వుండాల్సిందే.
సౌష్టికాహారం తీసుకుంటూ చేసే పనులను టైమ్ ప్రకారం విభజించుకుంటూ సిస్టమేటిక్‌గా పూర్తి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్