పూరీ-కళ్యాణ్ రామ్ సినిమా తొలి షెడ్యూల్ మే 25 నుండి..
- May 10, 2016
ఏ తెలుగు ప్రేక్షకుడు ఊహకీ అందకుండా కళ్యాణ్ రామ్‌తో సినిమా కన్ఫర్మ్ చేసి అందరినీ కళ్ళప్పగించేలా చేశారు పూరి జగన్నాధ్. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా రెగ్యలుర్ షూటింగ్ మే 25 నుండి జరుగనుంది. జర్నలిస్ట్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనపడనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన పాత్రకి సంబంధించి ఓ స్టైలిష్ లుక్‌ని సిద్ధం చేయించారట పూరి. ఈ సినిమా తొలి షెడ్యూల్ మే 25 నుండి వారం రోజుల పాటు హైదరాబాద్‌లో, తర్వాత షెడ్యూల్ స్పెయిన్‌లో నెల రోజుల పాటు జరుగనుందని సమాచారం. నందమూరి ఆర్ట్స్ బ్యానర్‌లో కళ్యాణ్ రామ్ నిర్మించినున్న ఈ సినిమాతో అదితి ఆర్య హీరోయిన్‌గా పరిచయమవనుంది. 'టెంపర్'తో యంగ్ టైగర్‌కి అదిరిపోయే హిట్టిచ్చిన ఈ డాషింగ్ డైరక్టర్ కళ్యాణ్ రామ్‌కి ఏ స్థాయి విజయాన్నిస్తారో మరి..!
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







