బహ్రెయిన్ జనాభాలో 'తీవ్ర అసమతుల్యత'
- May 16, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ ప్రస్తుతం లింగ నిష్పత్తిలో తీవ్రమైన అసమతుల్యతను ఎదుర్కొంటుంది. తాజా డేటా ప్రకారం.. 2022, 2023 మధ్య రాజ్య జనాభా 13,000 పెరిగినప్పటికీ.. మొత్తం జనాభాలో 38.1 శాతం స్త్రీలు, 61.9 శాతం పురుషులు నిష్పత్తి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా లింగ నిష్పత్తి తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఖతార్, యూఏఈ, బహ్రెయిన్‌లలో స్త్రీ-పురుష నిష్పత్తులు ఎక్కువగా ఉన్న దేశాలు అని తాజా డేటా చెబుతోంది.
గల్ఫ్ దేశాలు ఇంత అసమాన జనాభా ఉండేందుకు ప్రధానంగా పురుష తాత్కాలిక కార్మికుల పెద్ద వలస జనాభా అధికంగా ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు. బహ్రెయిన్ జనాభాలో దాదాపు సగం మంది వలస కార్మికులు ఉండటం వారి వాదనను బలపరుస్తుంది.
ప్యూ రీసెర్చ్ ప్రకారం.. అసమతుల్య లింగ నిష్పత్తికి దోహదం చేసే దేశాలలో సెక్స్-సెలెక్టివ్ అబార్షన్‌లు, ఆడ శిశుహత్యలు ఎక్కువగా కనిపిస్తుంది. అధ్యయనాలు అసమతుల్య జనాభా ప్రమాదకరమైనదిగా పేర్కొన్నాయి. చాలా సమాజాలలో భాగస్వామి దొరకక పిల్లల జనాభా పెరగడం లేదు. ఇంది పురుషులు, స్త్రీలకు బలమైన సామాజిక నిబంధనలు, ఒత్తిళ్లు తీసుకువస్తున్నాయి. పైగా ఈ సమస్య.. ఆయా వర్గాల దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







