యూఏఈ లో 47°C దాటిన ఉష్ణోగ్రతలు.. రెండు రోజుల్లో వర్షాలు?

- May 16, 2023 , by Maagulf
యూఏఈ లో 47°C దాటిన ఉష్ణోగ్రతలు.. రెండు రోజుల్లో వర్షాలు?

యూఏఈ: గత కొన్ని రోజులుగా యూఏఈలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే 14న అల్ దఫ్రాలో అత్యధికంగా 46°C నమోదుకాగా.. అంతకుముందు రోజు అల్ ఘేవీఫాత్‌లో 47.1°C ఉష్ణోగ్రత నమోదైంది. మే 15న కల్బాలో 44.6°C నమోదయింది. వేసవికి ముందు ఉష్ణోగ్రతల నుండి నివాసితులు కొంత ఉపశమనం పొందుతారని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) నుండి డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వారం చివరిలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కూడా పడతాయని చెప్పారు. దీంతో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు.  అరేబియా గల్ఫ్‌లో సముద్రం మధ్యస్థం నుండి కొంత అల్లకల్లోలంగా ఉంటుందని, ఒమన్ సముద్రంలో మధ్యస్థంగా ఉంటుందని ఎన్సీఎం ప్రకటించింది. తీరప్రాంతాలలో తేమగా ఉంటుందని, కొన్ని పశ్చిమ ప్రాంతాలలో పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com