ఇర్ఫాన్‌ ఖాన్‌ అబ్దుల్‌ కలాంగా..

- May 11, 2016 , by Maagulf
ఇర్ఫాన్‌ ఖాన్‌ అబ్దుల్‌ కలాంగా..

ఎలాంటి పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోగలరు బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితాధారంగా రానున్న సినిమాలో ఇర్ఫాన్‌ నటించనున్నట్లు బాలీవుడ్‌ సమాచారం.మరాఠీ నిర్మాత ప్రమోద్‌ గోరె కలాం జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సాధించిన విజయాల గురించి సినిమా నిర్మించనున్నారు. సినిమా చిత్రీకరణకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నారు. ఇందులో ఇర్ఫాన్‌ని ఎంపికచేసుకోవడానికి చర్చలు జరుపుతున్నారు. సినిమా కోసం ప్రమోద్‌ రామేశ్వరంలోని కలాం ఇంటికి వెళ్లి అతని సోదరుడిని కలిసి కలాం గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు.సినిమాకి 'ఏపీజే' టైటిల్‌ను ఖరారు చేశారు. జులై-ఆగస్టు నెలల్లో షూటింగ్‌ ప్రారంభం కానుంది. సినిమాను 2017లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం చేయనున్నారన్నదితెలియాల్సి ఉంది. 'దేశం కోసం కలాం ఎంతో చేశారు. భారతీయులందరికీఆయనే స్ఫూర్తి. సినిమాలో కలాం గురించి పూర్తిగా తెలియజేయడానికే రామేశ్వరం వెళ్లి ఆయన గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. అదీకాకుండా సినిమా చేయడానికి ముందు కలాం కుటుంబీకుల అనుమతి తీసుకోవాలనుకున్నాను.''ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి కలాం రాసిన 22 పుస్తకాలను కొనుగోలు చేశాను. ఆయన గురించి చెప్పాలంటే రెండున్నర గంటల సినిమాలో చెప్పలేం. ఆయన పాత్రలో పూర్తిగా ఒదిగిపోతారనే ఇర్ఫాన్‌ని తీసుకోవాలనుకుంటున్నాను. ఇర్ఫాన్‌ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడన్న నమ్మకం ఉంది' అని చెప్పారు ప్రమోద్‌ గోరె.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com