రోడ్డు ప్రమాదం పై సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి...
- May 17, 2023
హైదరాబాద్: ఏపి, గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆరుగురు గిరిజన కూలీల దుర్మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలకు ఆటోలో వెళ్తుండగా లారీ వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న సీఎం కేసీఆర్ గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్సను అందించాలని స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావును ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రమాద ఘటనను వివరించి తగు సహాయం చేయాలని కోరడంతో వెంటనే స్పందించిన సీఎం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







