వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..

- May 17, 2023 , by Maagulf
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అందరికి కొత్త చాట్ లాక్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ సూపర్ పర్సనల్ చాట్‌లకు లాక్‌ చేసుకోవచ్చు. తద్వారా మీ ఫోన్‌ను మరెవరికీ ఇచ్చినా వాట్సాప్ యాక్సెస్ చేయలేరు. ఈ కొత్త ఫీచర్ ఆ చాట్‌లోని విషయాలను నోటిఫికేషన్‌లలో ఆటోమాటిక్‌గా హైడ్ చేస్తుంది. మీ ప్రైవసీ ప్రొటెక్షన్ అందిస్తుంది. వాట్సాప్ అప్‌డేట్ క్రమక్రమంగా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి అప్‌డేట్ చేరడానికి మరింత సమయం పడుతుంది. ఇప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్‌ని అందుకుంది. యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంది. కానీ, ఇందులో ఒక లొసుగు ఉందని గమనించాలి.

వాట్సాప్ చాట్‌లాక్ ఫీచర్ లొసుగు ఇదే :
మీరు చాట్ లాక్ ఫోల్డర్‌ను ఓపెన్ చేసి విండోను మూయడం మర్చిపోతే.. మీ వాట్సాప్‌ను ఓపెన్ చేసినా ఎవరైనా మీ ప్రైవేట్ చాట్‌లను చూడవచ్చు. మీరు చాట్‌లాక్ ఫీచర్‌ని ఉపయోగిస్తే.. వాట్సాప్ యాప్‌ను మూసివేసే ముందు ఫోల్డర్‌ను మూసివేసినట్లు నిర్ధారించుకోవాలి. అదనంగా, మీ ఫోన్‌ను క్లోజ్ చేసినప్పటికీ అది కనిపిస్తూనే ఉంటుంది.

దీనికి కారణంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌లో బగ్ లేదా లూప్ హోల్ కావచ్చు, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మరో కొత్త అప్‌డేట్ ద్వారా ఈ బగ్ ఫిక్స్ చేయనుంది. అయినప్పటికీ మీరు చింతించాల్సిన అవసరం లేదు. దీనికి ఒక పరిష్కారం ఉంది. మీ ప్రైవేట్ చాట్‌లను ప్రొటెక్ట్ చేసుకునే వీలుంది.

ఈ బగ్ ఎలా ఫిక్స్ చేయాలంటే? 
వాట్సాప్ యూజర్లు మెసేజింగ్ యాప్ ఫింగర్ ఫ్రింట్ లాక్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయవచ్చు. మీ చాట్ లాక్ ఫీచర్ పని చేయకపోయినా, యాప్‌కి సెకండరీ సెక్యూరిటీ ఫీచర్ యాడ్ అవుతుంది. దాంతో మీ వాట్సాప్సందేశాలను ఎవరూ చదవలేరు. ఫింగర్‌ప్రింట్ లాక్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడానికి వాట్సాప్‌ని ఓపెన్ చేయాలి. సెట్టింగ్‌లు, ప్రైవసీ సెక్షన్‌కు వెళ్లి కిందికి స్క్రోల్ చేయాలి. ఇప్పుడు మీకు అక్కడ ఫింగర్ ఫ్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై Tap చేస్తే సరి..

వాట్సాప్ మరిన్ని చాట్ లాక్ ఆప్షన్లను యాడ్ చేయాలని భావిస్తోంది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌కు మరిన్ని చాట్ లాక్ ఆప్షన్లను యాడ్ చేయాలని యోచిస్తున్నట్లు వాట్సాప్ ధృవీకరించింది. రాబోయే కొన్ని నెలల్లో చాట్ లాక్ ఫీచర్ మరిన్ని ఆప్షన్లను అందించనుంది. ఇందులో గ్రూపు డివైజ్‌ల కోసం లాక్ చేయడం, మీ చాట్‌లకు పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. తద్వారా మీరు మీ ఫోన్‌కి ఉపయోగించే పాస్‌వర్డ్‌కు భిన్నంగా స్పెషల్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించవచ్చు.

చాట్ లాక్ ఫోల్డర్ ఎక్కడ ఉంది?
చాట్ లాక్ ఫోల్డర్ వాట్సాప్ యాప్ టాప్ కార్నర్‌లో ఉంది. ఈ ఆప్షన్ కనుగొనడానికి ఇన్‌బాక్స్‌ను నెమ్మదిగా కిందికి డ్రాగ్ చేయాలి. లాక్ చేసిన చాట్‌లను యాక్సెస్ చేసేందుకు మీ ఫోన్ పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్‌ని ఎంటర్ చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com