'రాయుడు' చిత్రం ఆడియోను ఇవాళ విడుదల ...
- May 11, 2016
విశాల్, శ్రీదివ్య జంటగా నటించిన 'రాయుడు' చిత్రం ఆడియోను ఇవాళ హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. హీరో విశాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా'రాయుడు' సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. చిత్ర ట్రైలర్‌ను కూడా త్వరలో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మే 20న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై విశాల్ సమర్పిస్తున్నారు. ఇమాన్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. విశాల్ ఈ చిత్రంలో విభిన్న పాత్రతో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక మాస్ ఎంటర్టైనర్. ప్రస్తుతం విశాల్ పందెంకోడికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







