'రాయుడు' చిత్రం ఆడియోను ఇవాళ విడుదల ...

- May 11, 2016 , by Maagulf
'రాయుడు' చిత్రం ఆడియోను ఇవాళ విడుదల ...

విశాల్‌, శ్రీదివ్య జంటగా నటించిన 'రాయుడు' చిత్రం ఆడియోను ఇవాళ హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. హీరో విశాల్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా'రాయుడు' సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. చిత్ర ట్రైలర్‌ను కూడా త్వరలో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మే 20న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై విశాల్‌ సమర్పిస్తున్నారు. ఇమాన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చారు. విశాల్‌ ఈ చిత్రంలో విభిన్న పాత్రతో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌. ప్రస్తుతం విశాల్‌ పందెంకోడికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com