అయ్యో పాపం కరాటే కళ్యాణి.! ఆమెపై ‘మా’ అంత చిన్న చూపా.?
- May 18, 2023‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, కమెడియన్ కమ్ నటి అయిన కరాటే కళ్యాణికి షో కాజ్ నోటీసులు పంపించారు. అదేంటీ.? అంతటి తప్పు ఏం చేసిందామె అంటారా.! చేసేసింది. ఏం చేస్తాం. మా అధ్యక్షులు శిక్షించేంత తప్పుగా పరిగణించాలా.? వద్దా.? అనేది ఎవరి అభిప్రాయానికి వారికే వదిలేయాలంతే.!
అసలు మ్యాటర్ ఏంటంటే.. రాముడు, కృష్ణుడు.. తదితర దేవుళ్లు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పెద్ద ఎన్టీయార్.. అయితే, మన ఇళ్లలోని దేవుళ్ల ఫోటోల్లో ఆయన ఎందుకు కనిపించరు.? అనవసరంగా ఈ వెర్రిని బలవంతంగా రుద్దేస్తున్నారు.. అందుకే సినిమా వేరు. నిజం వేరు.! అని కరాటే కళ్యాణి వ్యాఖ్యానించారు.
అంతే.! అలా మాట్లాడడమే ఆమె చేసిన తప్పు. ఆ తప్పుకు శిక్షను ఎంత ఫాస్ట్‌గా అమలు చేసేశారో చూశారా.? గౌరవనీయులైన ‘మా’ అధ్యక్షులు.
మా అధ్యక్షుడిగా ఆయన నిర్వర్తించాల్సిన ఎన్నో పెద్ద బాధ్యతలు వుండనే వున్నాయ్. అవేమీ కనిపించలేదు. నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతూ ఇండస్ట్రీ లోని ప్రముఖులను అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్న ప్రబుద్ధులు ఎందరో వున్నారు. వారెవరూ మా అధ్యక్షుడి కంటికి కనిపించలేదు. ఆ బూతు పురాణాలు వినిపించలేదు.
పాపం.! కరాటే కళ్యాణి బక్క ప్రాణం కదా.. అడిగే వాళ్లు లేరనుకున్నారో ఏమో.! ఇమీడియట్గా షో కాజ్ నోటీసులు పంపించేసి చేతులు దులిపేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం