సంతోష్‌కి ఇకనైనా ‘మంచి శకునం’ లభించేనా.!
- May 18, 2023సంతోష్ శోభన్.. అప్పుడెప్పుడో ‘పేపర్ బోయ్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు మంచి విషయమున్న నటుడే. కానీ, టైం కలిసి రావడం లేదు.
వరుసగా సినిమాలూ చేసుకుంటూ పోతున్నాడు కానీ, సరైన హిట్ఠు పడడం లేదు. తాజాగా ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్ గట్టిగానే చేశారు ఈ సినిమాకి. కానీ, తొలి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
సంతోష్ శోభన్ తన వరకూ తాను బాగానే ఫర్ఫామ్ చేసుకుంటూ పోయాడు. కానీ, అక్కడక్కడా టేకింగ్ కాస్త బోర్ కొట్టించేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
స్లో నెరేషన్, రన్ టైమ్ ప్రేక్షకుల్ని విసిగించేశాయ్ అంటున్నారు. మాళవికా నాయర్ ఈ సినిమాలో సంతోష్‌కి జోడీగా నటించింది.
అన్నట్లు ఈ మధ్య ‘కళ్యాణం కమనీయం’, ‘శోభన్ బాబు శ్రీదేవి’ సినిమాలతో ఆకట్టుకున్నాడు సంతోష్ శోభన్. ఇక, వెరీ లేటెస్ట్గా ‘అన్నీ మంచి శకునములే’ విషయానికి వస్తే, సమ్మర్ రిలీజ్ టైమింగ్ బాగానే వుంది. మరి, ఈ హాలీడే ప్యాకేజ్ని సంతోష్ యూజ్ చేసుకోగలడో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు