యూఏఈలో కొత్త ట్రాఫిక్ ఉల్లంఘనలు.. Dh2,000 వరకు ఫైన్స్

- May 19, 2023 , by Maagulf
యూఏఈలో కొత్త ట్రాఫిక్ ఉల్లంఘనలు..  Dh2,000 వరకు ఫైన్స్

యూఏఈ: యూఏఈలో కొత్త ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలను ప్రకటించారు. రోడ్డు భద్రతను పెంచడమే లక్ష్యంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు యూఏఈ అంతర్గత మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పోస్ట్ తెలిపింది. ముఖ్యంగా వర్షం, అస్థిర వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అత్యవసర పరిస్థితులకు సంబంధించి కొత్త నిబంధనలు ఉన్నాయని పేర్కొంది. కొత్త జరిమానాలు:

>> వర్షపు వాతావరణంలో లోయలు, వరదలు ఉన్న ప్రాంతాలు మరియు ఆనకట్టల దగ్గర గుమిగూడడం: Dh1,000 జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లు

>> ముంపునకు గురైన లోయల్లోకి ప్రవేశించడం: Dh2,000 జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు, 60 రోజుల వాహనాల జప్తు

>> ట్రాఫిక్‌ను నియంత్రించకుండా సంబంధిత అధికారులను అడ్డుకోవడం, లేదా అత్యవసర పరిస్థితులు, విపత్తులు, సంక్షోభాలు,  వర్షాల సమయంలో అంబులెన్స్-రెస్క్యూ వాహనాలను అడ్డుకోవడం: Dh1,000 జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు, 60 రోజుల వాహనాల జప్తు

 సాధారణంగా యూఏఈలోని అధికారులు అస్థిర వాతావరణ పరిస్థితుల్లో నివాసితులు లోయలు, ఆనకట్టల నుండి దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో పర్వతాల నుండి నీరు ప్రవహించి లోయలు వేగంగా నీటితో నిండి వరదలుగా మరతాయి. వాహనాలు కూరుకుపోయే ప్రమాదం ఉన్నందున వర్షాల సమయంలో లోయలను దాటవద్దని వాహనదారులను ఎల్లప్పుడూ హెచ్చరిస్తుంటారు. నివాసితులు, పర్యాటకులు వర్షపు వాతావరణంలో వరదలకు గురయ్యే ప్రాంతాలకు వెళ్లడం ఈ కొత్త చట్టాల ప్రకారం ఇక చట్టవిరుద్ధం అవుతుందని ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిగ్-జనరల్ ఇంజనీర్ హుస్సేన్ అల్ హర్తీ వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com