అమెరికా బాస్కెట్‌బాల్ ప్లేయర్‌కు బహ్రెయిన్‌లో 10 ఏళ్ల జైలు శిక్ష

- May 20, 2023 , by Maagulf
అమెరికా బాస్కెట్‌బాల్ ప్లేయర్‌కు బహ్రెయిన్‌లో 10 ఏళ్ల జైలు శిక్ష

బహ్రెయిన్: గంజాయిని రవాణా చేయడం, ఉపయోగించడం, పంపిణీ చేయడం కోసం బహ్రెయిన్ పోలీసులు ఈ ఏడాది ప్రారంభంలో అరెస్టు చేసిన ఒక అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడికి హై క్రిమినల్ కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బహ్రెయిన్‌లోని స్థానిక క్లబ్‌లో ఆడుతున్న నిందితుడికి కోర్టు BD5,000 జరిమానా విధించింది. ఇదే కేసులో ప్రమేయం ఉన్న ఒక మహిళను సుప్రీం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

కోర్టు ఫైల్స్ ప్రకారం.. అమెరికా నుంచి వచ్చిన కన్సైన్ మెంట్ ను వీరిద్దరు స్వీకరించేందుకు వెళ్లారు. అంతకుముందే దాంట్లో డ్రగ్స్ దాచి ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. పార్సిల్ తీసుకునేందుకు రాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అనంతరం ఇరువురిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com