జూలై నుండి విద్యుత్ బిల్లులో మినహాయింపులు..!

- May 20, 2023 , by Maagulf
జూలై నుండి విద్యుత్ బిల్లులో మినహాయింపులు..!

యూఏఈ: జూలై 2023 నుండి పరిమిత ఆదాయం కలిగిన ఎమిరాటీ వ్యవసాయ యజమానుల నెలవారీ విద్యుత్ బిల్లులను తగ్గించనున్నారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. వ్యవసాయ దారులపై ఆర్థిక భారాలను, ముఖ్యంగా విద్యుత్ టారిఫ్‌లకు సంబంధించిన ఆర్థిక భారాలను తగ్గించాలని అధికారులను అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ, యూనియన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ వారు అర్హులైన లబ్ధిదారులకు రాయితీలు అందిస్తున్నట్లు ధృవీకరించారు. సబ్సిడీ జూలై 2023 నుండి వర్తించబడుతుందని అధికారులు పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com