ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త స్మార్ట్ఫోన్ల పై అదిరే డీల్స్..
- May 21, 2023
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ 2023 సేల్ మళ్లీ మొదలైంది. అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది. (Google Pixel 7a), (Apple iPhone 14) మరిన్నింటిని కొత్తగా ప్రారంభించిన స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ పొందవచ్చు. కొనుగోలుదారులకు ఇదే సరైన సమయం.. అంతేకాదు.. ఎలక్ట్రానిక్స్, ఇయర్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర గాడ్జెట్లపై బెస్ట్ డీల్స్ కూడా అందిస్తోంది. ఈ సేల్ మే 19న ప్రారంభం కాగా.. మే 21, 2023న ముగుస్తుంది. మీరు మిస్ చేయకూడని కొన్ని స్మార్ట్ఫోన్లలో బెస్ట్ డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
ఆపిల్ ఐఫోన్ 14 :
ఆపిల్ iPhone 14 (128 GB) రూ. 69,999 వద్ద లభిస్తుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై కస్టమర్లు రూ. 4వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా, కొనుగోలుదారులు పాత స్మార్ట్ఫోన్లపై రూ. 33వేల వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ డీల్‌పై ధరను మరింత తగ్గించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. 128GB, 256GB, 512GB స్టోరేజీ ఆప్షన్లతో Apple A15 బయోనిక్ చిప్సెట్ డివైజ్‌తో వస్తుంది.
గూగుల్ Pixel 7a :
ఇటీవలే కొత్తగా లాంచ్ అయిన గూగుల్ (Pixel 7a) ధర రూ. 43,999కు అందుబాటులో ఉంది. కోటక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలతో కస్టమర్లు 10 శాతం వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు..కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లపై రూ. 34వేల వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ డీల్‌పై ధరను మరింత తగ్గించవచ్చు.
గూగుల్ Pixel 7a 6.1-అంగుళాల Full-HD+ OLED డిస్ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. సాధారణంగా ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. HDR కంటెంట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 7a నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త Tensor G2 SoCని కలిగి ఉంది. అదే చిప్ ప్రీమియం పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ఫోన్లలో కనిపిస్తుంది.
పోకో F5 5G :
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో Poco F5 5G (8GB) ధర రూ. 29,999కు అందుబాటులో ఉంది. కోటక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై కస్టమర్లు 10 శాతం వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. Qualcomm Snapdragon 7+ Gen2 చిప్సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.
ఒప్పో రెనో 8 ప్రో 5G :
ఒప్పో Reno 8 Pro 5G ఫోన్ (256 GB ROM, 12 GB RAM)తో రూ. 45,999 వద్ద లభిస్తుంది. కోటక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలతో కస్టమర్లు 10 శాతం వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. Mediatek డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్‌తో ఆధారంగా పనిచేస్తుంది. 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది.
వివో T1X :
వివో సేల్ సమయంలో Vivo T1X ( 4GB RAM, 128GB ROM) ధర రూ. 12,999కు సొంతం చేసుకోవచ్చు. కోటక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై కస్టమర్లు 10 శాతం వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా, కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లను రూ. 12,450 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ డీల్‌పై ధరను మరింత తగ్గించవచ్చు. Qualcomm Snapdragon 680 చిప్సెట్ ద్వారా ఆధారితమైనది. 6.58-అంగుళాల Full HD+ డిస్ప్లేను కలిగి ఉంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







