అంతరిక్ష కేంద్రానికి మరో ఇద్దరు సౌదీ వ్యోమగాములు..!
- May 21, 2023
వాషింగ్టన్ : సౌదీ అరేబియాకు చెందిన తొలి మహిళా వ్యోమగామి రయ్యానా బర్నావి, ఆమె సహోద్యోగి అలీ అల్ ఖర్నీ మే 21 (ఆదివారం)న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరనున్నారు. బర్నావి.. రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలు. F-16 ఫైటర్ పైలట్ అల్ ఖర్నీతో కలిసి యాక్సియమ్ స్పేస్ 2 మిషన్‌లో భాగం అవుతారు. వ్యోమగామి పెగ్గి విస్టన్, పైలట్ జాన్ షాఫ్ఫ్నర్ కూడా యాక్సియమ్ స్పేస్ 2 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్ వెళ్లనున్నారు.
అల్ ఖర్నీ, బర్నావీ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించే మొదటి సౌదీలు .బర్నావి అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి సౌదీ మహిళగా రికార్డు సృష్టించనున్నారు. "పరిశోధన నా జీవితంలో అభిరుచి" అని ఆమె ప్రీ-లాంచ్ సందర్భంగా మీడియాతో చెప్పారు. “ఈ రోజు సౌదీ అరేబియా ప్రభుత్వం, సౌదీ స్పేస్ కమీషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న సౌదీ అరేబియా మహిళా వ్యోమగామిగా నేను ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. గౌరవంగా ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి, వారి కలలకు ప్రాతినిధ్యం వహించడానికి ఇది నాకు గొప్ప అవకాశం. ... ఇది ప్రతి ఒక్కరికీ కల సాకారం అవుతుంది. ” అని ఆమె పేర్కొన్నారు.
SpaceX ఫాల్కన్ 9 రాకెట్ పై నుండి లిఫ్ట్ ఆఫ్ 5:37 p.m.కి ప్లాన్ చేయబడింది. EST ఆదివారం సాయంత్రం 5:14 గంటలకు బ్యాకప్ లాంచ్ కు సెట్ చేశారు. ఎనిమిది రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో విట్సన్, షాఫ్నర్, అల్ ఖార్నీ, బర్నావి 20 పరిశోధన ప్రాజెక్టులను చేపట్టనున్నారు. వాటిలో 14 సౌదీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినవి ఉన్నాయి. ఇవి మానవ శరీరధర్మశాస్త్రం, కణ జీవశాస్త్రం నుండి సాంకేతికత అభివృద్ధి వరకు పలు ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయని నాసా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









