గ్రాండ్ మస్టీదులో మతాఫ్ విస్తరణ భవనానికి ‘సౌదీ పోర్టికో’ పేరు ఖరారు
- May 22, 2023
మక్కా: గ్రాండ్ మస్జీదు వద్ద ఉన్న మతాఫ్ విస్తరణ బిల్డింగ్ ప్రాజెక్ట్‌కు సౌదీ పోర్టికో అని పేరు పెట్టేందుకు సౌదీ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారని రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల ప్రెసిడెన్సీ హెడ్ షేక్ అబ్దుల్ రెహ్మాన్ అల్-సుదైస్ ప్రకటించారు. అబ్బాసిద్ పోర్టికో చుట్టూ ఉన్న సౌదీ పోర్టికో గ్రాండ్ మస్జీదు ఇంతకు ముందు చూడని విశాలమైన ప్రాంతాన్ని కలిగి ఉందన్నారు. ఇది నాలుగు అంతస్తులను కలిగి ఉంటుందన్నారు. సౌదీ పోర్టికో.. మతాఫ్‌లు గరిష్టంగా 287,000 మంది ఆరాధకులకు, గంటకు 107,000 మంది తవాఫ్ చేసేవారికి వసతి కల్పిస్తాయని వివరించారు.
సౌదీ పోర్టికోలో అబ్బాసిద్ పోర్టికో వెనుక ఉన్న మతాఫ్ (పవిత్ర కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసే ప్రాంతం), దాని పరిసర ప్రాంగణంలో ఉన్న పవిత్ర కాబా విస్తరణ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని ప్రెసిడెన్సీ చీఫ్ చెప్పారు. "ఆధునిక సౌదీ అరేబియా స్థాపకుడు రాజు అబ్దుల్ అజీజ్, పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా గ్రాండ్ మస్జీదును విస్తరించాలని ఆదేశించాడు. తదనుగుణంగా, 1955లో సౌద్ రాజు కాలంలో విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. కింగ్ సౌద్, కింగ్ ఫైసల్ మరియు కింగ్ ఖలీద్ కాలంలో పోర్టికో భవనం విస్తరణ కొనసాగింది.’’ అని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









